హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన కుంతియా... రేవంత్ కోసమే!
- మధ్యాహ్నం 12 గంటలకు రానున్న కుంతియా
- ఆపై రేవంత్ రెడ్డితో భేటీ
- ఢిల్లీకి స్వయంగా తీసుకుపోనున్న కుంతియా
మరోవైపు ప్రస్తుతం కొడంగల్ లో కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ రెడ్డి, అది ముగియగానే మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి, కుంతియాను కలిసి, తిరిగి సాయంత్రం కొడంగల్ కు చేరుకుని రాత్రికి కార్యకర్తలతో సమావేశాలు కొనసాగిస్తారని తెలుస్తోంది. కుంతియాతో పాటు కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా రేవంత్ ను కలుస్తారని సమాచారం. ఇక రేపటివరకూ ఇక్కడే ఉండే కుంతియా, రేవంత్ ను తీసుకుని ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది.