రేవంత్ సంగతి అటో ఇటో ఇవాళే తేల్చేస్తానన్న చంద్రబాబు!
- చంద్రబాబు రాగానే వెళ్లి కలిసిన ఎల్ రమణ
- విషయమంతా విని మరోసారి మాట్లాడి చూద్దామన్న చంద్రబాబు
- ఏది ఏమైనా ఇవాళే ఓ నిర్ణయం తీసుకుందామని వెల్లడి!
ఆయన పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారని రమణ వ్యాఖ్యానించడంతో, ఓ సారి చెప్పి చూద్దామని అన్న చంద్రబాబు, ఇవాళ సాయంత్రంలోగా ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాతనే నేతలందరితో కలసి లేక్ వ్యూ గెస్టు హౌస్ లో చంద్రబాబు సమావేశమై తాజా పరిస్థితులను చర్చించారు. ఇక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయంపైనే చర్చ సాగుతోంది.