మళ్లీ నిర్ణయం మార్చుకున్న రేవంత్... ఎల్.రమణ సమావేశానికి హాజరు!
Add ap7am to your home Screen

మళ్లీ నిర్ణయం మార్చుకున్న రేవంత్... ఎల్.రమణ సమావేశానికి హాజరు!

  • నేటి మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ సమావేశం
  • గోల్కొండ హోటల్ లో ఎల్పీ సమావేశం
  • తన అభిప్రాయాన్ని మరోసారి చెప్పనున్న రేవంత్
తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తలపెట్టిన టీడీపీ, బీజేపీ ఎల్పీ సమావేశానికి హాజరు కాకూడదని ముందుగా భావించిన ఆయన, ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఈ మధ్యాహ్నం జరిగే సమావేశానికి తాను వెళ్లనున్నట్టు రేవంత్ వెల్లడించారు.

 మాసబ్ ట్యాంక్ లోని గోల్కొండ హోటల్ లో బీజేపీ, టీడీపీ నేతలు సమావేశం కానుండగా, ఓ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే రేవంత్ హాజరు కావచ్చని ఇప్పటికే ఎల్ రమణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వెళ్లి తన వాదనను మరోసారి వినిపించాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News