73 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకున్న 'జై లవకుశ'!
- సెప్టెంబర్ 21న విడుదలైన 'జై లవ కుశ'
- ఎన్టీఆర్ నటనకు 100 మార్కులు
- వసూళ్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది
- స్వల్ప నష్టాలతో సరిపెట్టుకుంది
80 కోట్ల షేర్ ను రాబడితే ఈ సినిమా ఆ స్థాయిని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా ఫుల్ రన్ లో 80 కోట్ల షేర్ మార్క్ ను అందుకోలేకపోయింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 86 కోట్లకు అమ్మారు .. కానీ 73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. 13 కోట్ల వరకూ నష్టాలు తెచ్చుకున్న ఈ సినిమా .. వసూళ్ల పరంగా ఎన్టీఆర్ కెరియర్లో 'జనతా గ్యారేజ్' తరువాత స్థానంలోనే నిలిచిందని అంటున్నారు.