నాతో ఉండేవాళ్లు రండి... రేపు అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ మీటింగ్: రేవంత్ రెడ్డి
- లెజిస్లేచర్ మీటింగ్ కు కాల్ చేసిన రేవంత్
- టీడీపీఎల్పీ లీడర్ ను తానేనని వెల్లడి
- సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు
- ప్రస్తుతం రేవంత్ తో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు
టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉంటారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం టీడీపీ తరఫున రేవంత్ తో పాటు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మిగతావారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక వీరిద్దరిలో ఎవరు రేపు రేవంత్ వెంట నిలుస్తారన్నది ఆసక్తికరం.