గజదొంగను ఓడించేందుకు దొంగకు మద్దతిస్తే తప్పేంటి?: బీజేపీపై హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
- నేనేమీ దొంగ చాటుగా వెళ్లి పాకిస్ధాన్ ప్రధానిని కలవలేదు
- భారతీయుడైన రాహుల్ గాంధీని మాత్రమే కలిశాను
- గుజరాత్ లో ప్రతీది తమ ఆస్తి అన్నట్టు బీజేపీ భావిస్తోంది
ఉత్తర గుజరాత్ లో రోడ్ షో, బహిరంగ సభల కారణంగా రాహుల్ గాంధీ సమావేశానికి వెళ్లలేకపోయానని ఆయన తెలిపారు. గుజరాత్ లో ఉన్న ప్రతీది తమ ఆస్తి అన్నట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తానేమీ దొంగచాటుగా వెళ్లి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలవలేదని, భారతీయుడైన రాహుల్ గాంధీని మాత్రమే కలిశానని ఆయన ఎద్దేవా చేశారు.