అదిరింది.. ప్రభాస్ 'సాహో' ఫస్ట్ లుక్!

  • అదిరిపోయే రీతిలో ఉన్న ఫస్ట్ లుక్
  • సినిమాపై భారీ అంచనాలు
  • మీ ప్రేమకు థ్యాంక్స్ అన్న ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం మాత్రమే కనిపించేలా ముసుగు వేసుకుని, ఫొన్ లో మాట్లాడుతూ ఉన్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'బాహుబలి' అఖండ విజయం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సందర్భంగా ప్రభాస్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'మీ ప్రేమకు చాలా థ్యాంక్స్' అని ట్వీట్ చేశాడు. మీ కోసం ఈ ఫస్ట్ లుక్ అంటూ ట్వీట్ చేశాడు. 
Go Back to Shorts
prabha
saaho film
tollywood
saaho first look

More Telugu News