2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: హిల్లరీ క్లింటన్
- కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటా
- ఓటమికి కారణాలు నాకే అర్థం కావట్లేదు
- ఇంటర్వ్యూలో వెల్లడించిన హిల్లరీ
`నేను అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనను. పోటీ చేయకున్నప్పటికీ, నా గొంతుకి మద్దతు పలికేవారు ఉన్నారు` అని హిల్లరీ తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావడానికి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ విషయం గురించి ట్వీట్ చేశాడు. `హిల్లరీ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందని అనుకుంటున్నారా? అని నన్ను అడిగారు. బహుశా చేయొచ్చు అని నా సమాధానం` అని ట్రంప్ ట్వీట్ చేయడం గమనార్హం.