డెన్మార్క్ ఓపెన్: దూసుకెళ్తున్న సైనా... నిష్క్రమించిన సింధు
- ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించిన సైనా నెహ్వాల్
- చైనా క్రీడాకారిణి చేతిలో ఓడిన పీవీ సింధు
- ఉత్కంఠగా సాగిన ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్‌లు
మరోవైపు పీవీ సింధు మాత్రం షెన్ యూఫీ చేతిలో 17-21, 21-23 తేడాతో ఓడిపోయింది. తర్వాతి రౌండ్‌లో సైనా నెహ్వాల్, థాయ్‌లాండ్ బ్యాడ్మింటన్ స్టార్ నిట్చావోన్ జిందాపోల్‌తో గానీ, రష్యాకు చెందిన ఇవ్జీనియా కొటసెట్సకాయా గానీ తలపడే అవకాశం ఉంది.
మరోపక్క పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు విజయం సాధించగా సాయి ప్రణీత్ ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి, మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సాత్విక్‌ల జోడీ, ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎ సిక్కీ రెడ్డిల జోడీలు కూడా ఓటమి పాలయ్యాయి.