నా కూతురు ఎప్పటికైనా అమెరికా అధ్యక్షురాలు అవుతుంది: ట్రంప్ మాజీ భార్య
- ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్
- ఇవానా ట్రంప్ కూతురే ఇవాంకా ట్రంప్
- డొనాల్డ్ ట్రంప్ తో బంధం అలాగే ఉందన్న ఇవానా
1977లో పెళ్లి చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, ఇవానాలు 1992లో విడాకులు తీసుకున్నారు. వీరికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ లు జన్మించారు. మార్లా మేపుల్స్ తో ట్రంప్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నందుకే తాను విడాకులు తీసుకున్నానని... తామిద్దరం దూరంగా ఉన్నప్పటికీ, తమ మధ్య బంధం మాత్రం అలాగే ఉందని ఇవానా ఇటీవల వెల్లడించారు.