టెస్టుల్లో అరంగేట్రానికి సిద్ధమైన ఐర్లాండ్.. పాక్‌తో తొలిపోరు!
- వచ్చే ఏడాది మేలో తలపడనున్న రెండు జట్లు
- ఈ ఏడాది మొదట్లోనే ఆఫ్ఘనిస్థాన్, ఐర్లండ్‌లకు టెస్ట్ హోదా
- 12కు పెరిగిన టెస్ట్ దేశాల సంఖ్య
ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్‌ల చేరికతో టెస్ట్ దేశాల సంఖ్య 12కు చేరుకుంది. గతవారం ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో పాకిస్థాన్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్థాన్, ఐర్లాండ్‌లకు స్వాగతం పలికేందుకు సంతోషిస్తున్నామని సీఈవో వారెన్ డ్యూట్రమ్ పేర్కొన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.