వేధింపుల నూజివీడు ఎస్సైని మూడు నెలలపాటు సస్పెండ్ చేసిన ఎస్పీ
- వేధింపుల ఎస్సైపై చర్యలు తీసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ
- మూడు నెలల సస్పెన్షన్
- వారం రోజుల్లో ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
భర్తకు సంబంధించిన కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వివాహిత ఫోన్ నెంబర్ తీసుకున్న వెంకటకుమార్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఆమె భర్తను కేసు నుంచి తప్పించాలంటే లాడ్జ్ లో తనతో గడపాలని ఒత్తిడి చేశాడు. తానలాంటి దానిని కాదని ఆమె ప్రాధేయపడ్డా ఆమెపై వేధింపులు ఆపలేదు.
దీంతో ఆమె అతని ఫోన్ వేధింపుల వాయిస్ రికార్డులతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించిన ఎస్పీ, ఆయన ట్రాక్ రికార్డును చెక్ చేశారు. అయితే అతనిపై పలువివాదాలు ఉండడంతో మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.