honey preet: మీడియాకు చిక్కిన హనీప్రీత్.. ఆమె ఇంటర్వ్యూ విశేషాలు ఇవే!

షార్ట్స్‌లో చూడండి
డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే, మీడియా కంటికి మాత్రం ఆమె చిక్కింది. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు ఇవే..
  • మీడియాలో నాపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. అవన్నీ పచ్చి అబద్ధాలు. 
  • నన్ను దేశ ద్రోహిగా అభివర్ణించడం చాలా దారుణం. 
  • నా మానసిక పరిస్థితి దారుణంగా ఉంది. 
  • గుర్మీత్ కు శిక్ష పడ్డ తర్వాత జరిగిన అల్లర్ల వెనుక నా హస్తం ఉందని నిందలు వేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ల దగ్గర ఏమైనా ఆధారం ఉందా?
  • జరిగిందంతా మీడియా చూసింది. నేనేం నేరం చేశానో మీరే చెప్పండి. 
  • నేను ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు. అలాంటప్పుడు అల్లర్ల వెనుక నా హస్తం ఉందని ఎలా చెబుతారు?
  • సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తామనే మేము కోర్టుకు వెళ్లాం. అయితే, తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు దగ్గర తీవ్ర విధ్వంసం జరిగింది. 
  • తీర్పు నేపథ్యంలో మా మైండ్ పనిచేయడం కూడా మానేసింది. అలాంటి పరిస్థితుల్లో అల్లర్లకు మేమెలా కుట్రలు పన్నుతాం?
  • నా తండ్రి (డేరా బాబా) అమాయకుడు. ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్నారు.
  • ఒక కూతురు ఏం చేస్తుందో... నేను కూడా అదే చేశా.
Go Back to Shorts
honey preet
dera
gurmeet
honey preet interview
honey preet with media

More Telugu News