ఇష్టమైతే పార్టీలో ఉండొచ్చు.. లేకపోతే వెళ్లిపోవచ్చు: రావెలపై వర్ల ఫైర్
- పదవిలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారు
- క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు
- ఎస్సీ వర్గీకరణం రాష్ట్రం చేతిలో లేదు
తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణను పాటించాల్సిందేనని... లేకపోతే చర్యలు తీసుకుంటామని వర్ల హెచ్చరించారు. మంద కృష్ణ మాదిగను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమని తామెన్నడూ అనలేదని చెప్పారు.
తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని రావెల కిషోర్ బాబు అన్న సంగతి తెలిసిందే. వర్గీకరణ కోసం అవసరమైతే శాసనసభ సభ్యత్వాన్ని సైతం వదులుకోవడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు.