బస్సులో మహిళా కండక్టర్- మహిళా కానిస్టేబుల్ ఫైట్!
- బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్ ఫైట్
- యూనిఫాంలో ఉంటే టికెట్ అక్కర్లేదన్న కానిస్టేబుల్
- ఘర్షణగా మారిన వాగ్వాదం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ప్రయాణికుడు
- పోలీస్ స్టేషన్ లో సెటిలైన వివాదం
దానికి ఆమె తాను డ్యూటీలో వున్నానని చెబుతూ, తన వద్దనున్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించారు. అయితే దానిని అనుమతించమని, ఒరిజినల్ చూపించాలని కండక్టర్ డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. కానిస్టేబుల్ ఆవేశంతో తన చేతిపవర్ రుచి చూపించగా, కండక్టర్ సీట్లో చతికిలబడిపోయింది. దీనిని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి. చివరికి ఈ కేసు పోలీస్ స్టేషన్ లో సెటిల్ అయిపోవడం విశేషం.