రేణు దేశాయ్ రియాల్టీ షో: ఆదాశర్మ .. జానీ మాస్టర్ కూడా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేణు దేశాయ్ రియాల్టీ షో: ఆదాశర్మ .. జానీ మాస్టర్ కూడా!

  •  'బిగ్ బాస్' స్థానంలో రియాలిటీ డాన్స్ షో
  •  'స్టార్ ప్లస్' లో 'నాచ్ బలియే' తరహాలో వుంటుందట
  •  ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్
  •  మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా ఆదా శర్మ .. జానీ మాస్టర్        
అశేష ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న 'బిగ్ బాస్' షో .. త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో ఒక రియాలిటీ డాన్స్ షోను ప్రసారం చేయడానికి 'స్టార్ మా' వారు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 'స్టార్ ప్లస్' లో వస్తోన్న 'నాచ్ బలియే' తరహాలో ఈ డాన్స్ షో వుంటుందట. ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారని సమాచారం.

 ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్ ను తీసుకున్నారు. మిగతా ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా జానీ మాస్టర్ ను .. ఆదా శర్మను తీసుకున్నారనేది తాజా సమాచారం. జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఆదా శర్మ విషయానికి వస్తే, హీరోయిన్ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. కథక్ నృత్యంలోను .. వెస్ట్రన్ డాన్సుల్లోను ఆమెకి మంచి నైపుణ్యం ఉందట. ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోమోలను వదులుతారేమో.        
renu desai

More Telugu News