డేరా బాబాపై సినిమా నిర్మాణం.. షూటింగ్ స్టార్ట్ అయింది
Add ap7am to your home Screen

డేరా బాబాపై సినిమా నిర్మాణం.. షూటింగ్ స్టార్ట్ అయింది

గుర్మీత్ రాం రహీం సింగ్ పై 'సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా' సినిమా

గుర్మీత్ సింగ్ పాత్రలో సంజయ్ గోరీ, హనీ ప్రీత్ గా రాఖీ సావంత్ 

డిసెంబర్ లో సినిమా విడుదల

డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్, అతని దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ జీవిత కథ ఆధారంగా సినిమా నిర్మించేందుకు బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ నడుం బిగించింది. తన సోదరుడు రాకేష్ సావంత్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుర్మీత్ రాం రహీం సింగ్ పాత్రను సంజయ్ గోరీ పోషిస్తుండగా, హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా తెలుగు సినిమాలతో పాటు, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా పేరును 'సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా'గా నిర్ణయించినట్టు తెలిపారు. 
dera baba
gurmeet ram raheem singh
hanipreet
movie

More Telugu News