జైల్లో డేరా బాబా వృత్తి, సంపాదన వివరాలు ఇవిగో!

చుట్టూ లక్షలాది మంది భక్తులు, మిరిమిట్లు గొలిపే సెట్టింగులు, హంసతూలికా తల్పాలు, బంగారు కంచాలు, మంచాలు, సింహాసనాలు.. ఇలా ఒకటేమిటి.. సకల సౌఖ్యాలు అనుభవించిన సన్యాసి డేరా సచ్ఛాసౌధ అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ ఇప్పుడు దుర్భర దారిద్ర్యాన్ని రోహ్ తక్ జైలులో అనుభవిస్తున్నాడు. గుర్మీత్‌ జైలు జీవితంపై జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్‌ వివరించారు. గుర్మీత్ జైలులో సాధారణ ఖైదీగానే ఉన్నారని తెలిపారు. ఆయన సెల్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు.

ఆయనకు కనీసం టీవీ, పత్రికలు కూడా అందుబాటులో లేవని, ఫోన్ సౌకర్యం కూడా  కల్పించలేదని ఆయన చెప్పారు. జైలులో గుర్మీత్ కు నైపుణ్యం లేని వృత్తిని అప్పగించామని చెప్పారు. దీంతో గుర్మీత్ రోజూ 8 గంటల పాటు కూరగాయలు, ఎండు ద్రాక్ష తోటల్లో పని చేస్తున్నారని చెప్పారు. ఇందుకు అతనికి రోజూ 20 రూపాయల కూలీ ముడుతుందని అన్నారు. నైపుణ్యం లేని కూలీలకు జైళ్లలో వేతనం 20 రూపాయలని ఆయన తెలిపారు. గుర్మీత్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్న దాంట్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
dera baba
grumeet ram rahim singh
rohtak central jail.

More Telugu News