హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ రంగంలోకి దిగిపోయాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ రంగంలోకి దిగిపోయాడు!

మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకి నాయక'తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదే. తనని మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారనే నమ్మకం శ్రీనివాస్ కి కుదిరింది. ఆ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు.

ఆయన నెక్స్ట్ మూవీకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. లక్ష్యం .. లౌక్యం .. డిక్టేటర్ వంటి హిట్స్ ను అందించిన శ్రీవాస్, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. తాజా షెడ్యూల్ ను 'పొల్లాచ్చి'లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. పూజా హెగ్డే  కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. మీనా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
srinivas
pooja hegde

More Telugu News