దిల్ రాజుకి రెండు సినిమాల వల్ల కోట్లలో లాస్?
ఈ సినిమా నైజామ్ హక్కులను 8 కోట్లకి పైగా ఖర్చు పెట్టి దిల్ రాజు తీసుకున్నారు. అయితే ఆయనకి 3 కోట్లకి పైగా షేర్ మాత్రమే వచ్చిందట. దాంతో 5 కోట్లు లాస్ అయ్యాడని అంటున్నారు. ఇక 'జయ జానకి నాయక' సినిమా ఏరియా హక్కులను కూడా ఆయనే తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా కూడా ఆయనకి 2 కోట్ల వరకూ రికవరీ కావలసి ఉందట. ఈ సినిమా విషయంలోను ఎంతోకొంత నష్టం తప్పకపోవచ్చని చెప్పుకుంటున్నారు.