ఎన్టీ రామారావు బయోపిక్ ను వర్మ చేసేనా?
Add ap7am to your home Screen

ఎన్టీ రామారావు బయోపిక్ ను వర్మ చేసేనా?

యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను రూపొందించడంలోను .. జీవితచరిత్రలను తెరకెక్కించడంలోను రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందే ఉంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ .. ఎన్టీ రామారావు జీవితచరిత్రను తెరకెక్కిస్తానని అన్నాడు. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు పట్ల బాలకృష్ణ పెద్దగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ కూడా వచ్చింది.

 దాంతో బాలకృష్ణ చేయనంటే ఎన్టీఆర్ పాత్రను వర్మ ఎవరితో చేయిస్తాడనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వర్మ మరో నటుడిని ఎంచుకుంటాడా? లేదంటే బయటి ఆర్టిస్టులతో చేస్తాడా? అనే ప్రశ్నలు కూడా అభిమానులను వేధిస్తున్నాయి. ఇక వర్మ  హడావిడిగా ఎనౌన్స్ చేసి  ఆ తరువాత పక్కకిపెట్టేసిన ప్రాజెక్టులు చాలానే వున్నాయి. ఆ జాబితాలోకి ఈ సినిమాను కూడా చేరుస్తాడా? అనేది చూడాలి.       
ram gopalvarma

More Telugu News