సాయిపల్లవిని గతంలోనే అడిగాను.. ఆమె తల్లి తిరస్కరించింది!: శేఖర్ కమ్ముల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవిని గతంలోనే అడిగాను.. ఆమె తల్లి తిరస్కరించింది!: శేఖర్ కమ్ముల

ఈ మధ్య కాలంలో యూత్ ను ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటిగా 'ఫిదా' గురించి చెప్పుకోవచ్చు. దర్శకుడిగా శేఖర్ కమ్ముల అంటే ఏమిటనే విషయాన్ని ఈ సినిమా మరో మారు నిరూపించింది. అలాంటి ఈ సినిమా ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసింది ఎవరయ్యా అంటే సాయిపల్లవేనని చెప్పాలి. ఆమె మంచి నటి అంటూ శేఖర్ కమ్ముల కితాబునిచ్చారు.

 తాను 'లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్' సినిమా చేసే సమయంలోనే ఆ సినిమా చేయమంటూ సాయిపల్లవిని సంప్రదించానని శేఖర్ కమ్ముల అన్నారు. అప్పుడామె డిగ్రీ చదువుతోందని చెప్పారు. తమ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడానికి వెళుతుందనీ .. తిరిగి వచ్చాకే సినిమాలు చేస్తుందని సాయిపల్లవి తల్లి తేల్చి చెప్పిందట. దాంతో తాను సైలెంట్ గా తిరిగి వచ్చేశాననీ ..  తమ కాంబినేషన్ 'ఫిదా'తో కుదిరిందని చెప్పుకొచ్చారు.    
sai pallavi

More Telugu News