'జై లవ కుశ' యూఎస్ హక్కులు 10.5 కోట్లు?
Add ap7am to your home Screen

'జై లవ కుశ' యూఎస్ హక్కులు 10.5 కోట్లు?

కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యూఎస్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు సమాచారం. ఆయన తన స్నేహితులతో కలిసి యూఎస్ హక్కుల కోసం 10.5 కోట్లకు కోట్ చేశాడట.

 దాంతో ఆయనకే ఖరారు చేయాలని కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. 'స్పైడర్' తెలుగు .. తమిళ యూఎస్ హక్కులు 15.5 కోట్లకి వెళ్లగా, 'జై లవకుశ' యూఎస్ హక్కులు ఒక్క తెలుగుకి సంబంధించే 10.5 కోట్లు పలకడం విశేషమేనని చెప్పాలి. ఈ హక్కులను దక్కించుకున్న నాగవంశీయే .. ఎన్టీఆర్ తదుపరి సినిమాకి నిర్మాత అనే సంగతి తెలిసిందే.
ntr
niveda

More Telugu News