రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు?
Add ap7am to your home Screen

రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు?

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ని ఖరారు చేసే యోచనలో వున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ని పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే ఖరారు కావచ్చని అంటున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఊటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి ఊటీలో జరిగే ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించనున్నారు. రామ్ పెదనాన్న స్రవంతీ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
Ram
anupama

More Telugu News