ఒకే పాటలో 42 రకాల జతల డ్రెస్ లను మార్చిన ఎన్టీఆర్!
Add ap7am to your home Screen

ఒకే పాటలో 42 రకాల జతల డ్రెస్ లను మార్చిన ఎన్టీఆర్!

బాబీ దర్శకత్వంలో .. కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణెలోని ఓ ప్యాలెస్ లో జరుగుతోంది. సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఒక పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలు .. ఈ పాటలో కనిపించనుండటం విశేషం.

అందువలన ఈ మూడు పాత్రల కోసం మాటిమాటికి ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్ తో రెడీ కావలసి వచ్చింది. అలాగే మూడు పాత్రలకు కలుపుకుని ఈ ఒక్క పాటలోనే 42 రకాల జతల డ్రెస్ లను వాడినట్టు చెబుతున్నారు. డ్రెస్ లతో పాటు ఎప్పటికప్పుడు బాడీ లాంగ్వేజ్ ను .. లుక్ ను  మారుస్తూ ఎన్టీఆర్ ఈ పాటలో పాల్గొన్నాడని అంటున్నారు. ఈ పాట ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుందనేది యూనిట్ సభ్యులు చెబుతోన్న మాట.
ntr
niveda

More Telugu News