70 కోట్లకు 'జై లవ కుశ' థియేటర్ రైట్స్!
Add ap7am to your home Screen

70 కోట్లకు 'జై లవ కుశ' థియేటర్ రైట్స్!

ఇప్పుడు అందరి దృష్టి 'జై లవ కుశ' సినిమాపైనే వుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం ..ముగ్గురు కథానాయికలు ఆయన సరసన కనిపించనుండటం ఇంతటి ఆసక్తికి కారణమైంది. జనంలో వున్న ఈ క్రేజ్ కారణంగానే ఈ సినిమా బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగినట్టుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ రైట్స్ 70 కోట్లకి అమ్ముడైనట్టు తాజా సమాచారం.

బిజినెస్ ఓపెన్ చేసిన రోజునే వివిధ ఏరియాలకు సంబంధించిన థియేటర్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు కావడం విశేషం. ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో .. ఇంత వేగంగా బిజినెస్ జరిగిన సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మరో భారీ విజయం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.       
ntr
niveda

More Telugu News