లోనావాలా ప్యాలెస్ లో 'జై లవ కుశ' షూటింగ్!
Add ap7am to your home Screen

లోనావాలా ప్యాలెస్ లో 'జై లవ కుశ' షూటింగ్!

ఎన్టీఆర్ వరుస సినిమాలను కమిటై వున్నాడు. అందువలన ఒకదాని తరువాత ఒకటి చకచకా పూర్తి చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడు. ఈ కారణంగానే 'జై లవకుశ' సినిమా షూటింగు విషయంలో ఏ మాత్రం జాప్యం జరగకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణే సమీపంలోని 'లోనావాలా'లో జరుగుతోంది.

అక్కడున్న ఒక ప్యాలెస్ లో ఎన్టీఆర్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. రెండవ టీజర్ ను వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టీజర్ ద్వారా 'లవ' పాత్రను పరిచయం చేయనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .  
ntr
niveda thomas

More Telugu News