supreme court: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మద్యం అమ్మకాలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ

షార్ట్స్‌లో చూడండి
జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న మ‌ద్యం దుకాణాల‌పై ఈ రోజు సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ దారుల్లో మ‌ద్యం అమ్మ‌కాలు ఇక నిలిపివేయాల్సిందేన‌ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్ షాపుల‌ను మూసివేయాలని, రానున్న ఏడాది వాటి లైసెన్సులు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కాగా, ఆయా దుకాణాల‌కు ఉన్న‌ ప్రస్తుత లైసెన్స్‌ కాల పరిమితి ముగిసేవరకు మాత్రం విక్ర‌యించుకోవ‌చ్చ‌ని చెప్పింది. దీంతో జాతీయ ర‌హ‌దారుల‌పై మందు బాబుల‌కు ఇక మద్యం దొర‌క‌కుండా పోతుంది.
Go Back to Shorts
supreme court

More Telugu News