కలలో ఇవి కనిపిస్తే ఏవౌతుంది ?
కలలనేవీ సహజంగానే వస్తుంటాయి కనుక కొంతమంది వాటిని గురించి పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం ఆ కల ... దేనిని సూచిస్తూ వచ్చిందోనని తీవ్రంగా ఆలోచిస్తూ వుంటారు. ఆ కల ఎలాంటి ఫలితాన్ని అందించబోతుందో ... ఏవౌతుందో అని ఆందోళన చెందుతూ వుంటారు. ప్రతి కలకి కాకపోయినా కొన్ని సమయాల్లో వచ్చిన కొన్ని కలలకి ఫలితం ఉంటుందని తెలుస్తోంది.
ఒక్కోసారి పూలతోటల్లోను ... పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా కలలు వస్తుంటాయి. మరోసారి ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ... పాములు - తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలకి ఫలితాలు చెప్పబడ్డాయి. కలలో పూలు గానీ ... పండ్లు గాని కనిపించడం వలన శుభకార్యాల్లోనూ ... దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే కాలంకాని కాలంలో ఇవి కనిపించడం వలన అసంతృప్తిని కలిగించే సంఘటనలు ఎదురౌతాయి.
ఇక కలలో పాలు ... తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన ... సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు ... తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది.
ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు - తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను ... తేళ్ళను చంపినట్టుగా కల వస్తే ... త్వరలోనే శత్రువులు నశిస్తారని అర్థం చేసుకోవాలి.