ధ్రువుడికి దర్శనమిచ్చిన శ్రీమహా విష్ణువు

శ్రీమహా విష్ణువును తమ పాశురాలతో కీర్తించిన పన్నిద్దరు ఆళ్వారులలో, పోయ్ గై ఆళ్వార్ .. పూదత్తాళ్వార్ .. పేయాళ్వార్ .. తిరుమజి శైప్పిరాన్ ఆళ్వార్ .. నమ్మాళ్వార్ .. కులశేఖరాళ్వార్ .. పెరియాళ్వార్ .. తొండరడిప్పొడి ఆళ్వార్ .. తిరుప్పానాళ్వార్ .. తిరుమంగై ఆళ్వార్ .. ఆండాళ్ .. మధురకవి ఆళ్వార్ లు కనిపిస్తారు.

ఈ పన్నిద్దరు ఆళ్వారులలో ఏవైనా ఒకరు, ఏ క్షేత్రములందు స్వామివారిని కీర్తిస్తూ పాశురం చెప్పారో ఆ క్షేత్రాలు దివ్య తిరుపతులుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి దివ్య తిరుపతులలో ఒకటిగా 'తిరునాగై' (నాగ పట్టణం) కనిపిస్తుంది. తిరుమంగై ఆళ్వార్ ఇక్కడి స్వామివారిని కీర్తించారు. పూర్వం ఇక్కడ నాగరాజును స్వామివారు అనుగ్రహించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'నాగ పట్టణం' అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీమహా విష్ణువు .. ధ్రువుడికి దర్శనమిచ్చిన ప్రదేశం ఇది. స్వామివారు సౌందర్య రాజ పెరుమాళ్ గా .. అమ్మవారు సౌందర్యవల్లి తాయారు పేర్లతో పూజలందుకుంటూ వుంటారు.


More Bhakti News