ఆధార్‌లో పేరు మార్చుకోవాలంటే ఇకపై ఈ పత్రాలు తప్పనిసరి: యూఐడీఏఐ కొత్త నిబంధనలు
Advertisement
- చిన్నపాటి అక్షర దోషాలకు సాధారణ గుర్తింపు పత్రం చాలు
- పెళ్లి, విడాకుల అనంతరం పేరు మార్పునకు ప్రత్యేక అఫిడవిట్
- డేటా ఎంట్రీ తప్పిదాల సవరణకు నిర్దేశిత పత్రాల సమర్పణ
- పూర్తి పేరు మార్పు కోసం గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి
- ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ధ్రువీకరణతో రూ.75 రుసుము
ఆధార్ కార్డులో పేర్ల మార్పులు, సవరణలకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్షర దోషాల సవరణ, వివాహం లేదా విడాకుల తర్వాత మార్పులు, పూర్తి పేరు మార్పు వంటి అంశాలను విభజిస్తూ నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌ఓపీ) తీసుకొచ్చింది. 2021 నాటి నిబంధనల స్థానంలో వచ్చిన ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
చిన్నపాటి సవరణలు, ప్రధాన మార్పులను బట్టి అవసరమైన పత్రాలను యూఐడీఏఐ వర్గీకరించింది. పొరపాటుగా పడిన చుక్కలు (డాట్స్) తొలగించడం, ఇనీషియల్స్ విస్తరించడం, చిన్న అక్షర దోషాలను సరిదిద్దడం లాంటి వాటిని మైనర్ మార్పులుగా పరిగణిస్తారు. వీటి కోసం సరైన గుర్తింపు కార్డు సమర్పిస్తే సరిపోతుంది.
వివాహం లేదా విడాకుల అనంతరం ఇంటిపేరు మార్చుకోవాలనుకునే వారు నిర్ణీత అఫిడవిట్ (అనెక్సర్ డి)తో పాటు గుర్తింపు పత్రాన్ని జతచేయాల్సి ఉంటుంది. ఆధార్ నమోదు సమయంలో డేటా ఎంట్రీ తప్పిదాలు జరిగితే పెద్దలకు అనెక్సర్ బి, మైనర్లకు అనెక్సర్ సి అఫిడవిట్లు సమర్పించాలి. లింగ మార్పిడి, చిన్నారుల పేర్ల మార్పులకూ ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు.
వ్యక్తి తన పేరును పూర్తిగా మార్చుకున్న సందర్భాలను 'మేజర్ నేమ్ ఛేంజ్'గా గుర్తిస్తారు. ఇలాంటి మార్పుల కోసం తప్పనిసరిగా ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సంబంధిత గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మార్పుల కోసం సమీప ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి, సంబంధిత పత్రాలు ఇచ్చి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి రూ.75 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.