నా కంపెనీలు మూయించారు.. ప్రస్తుతం నా దృష్టి వీటిపైనే!: బోరుగడ్డ అనిల్
Advertisement
- చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్
- ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడి
- రాబోయే రోజుల్లో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని స్పష్టీకరణ
చాలా కాలంగా బహిరంగంగా ఎక్కడా కనిపించని బోరుగడ్డ అనిల్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉంటూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో తన కంపెనీలన్నీ మూతపడ్డాయని, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు అనిల్ తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కు తనపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమ వల్లే తన కంపెనీలను మూసివేయించారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.
ప్రస్తుతం వ్యాపారాలు మళ్లీ మొదలవుతున్నాయని, ఆదాయం సృష్టించుకుంటూ, తన ఇద్దరు పిల్లలను బాగా చదివించడమే ప్రస్తుతానికి తనకున్న రెండు ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. అయితే, రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకోలేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని చెప్పారు. తాను ఎప్పటికీ జగన్ కి శిష్యుడిగానే కొనసాగుతానని, ఆయనకు అండగా ఉంటానని అన్నారు.
గత ఆగస్టు నెలలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి ధర్నా చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత ఆయన ప్రజల్లోకి రాలేదు. చాలా రోజుల మౌనం తర్వాత తాజా ఇంటర్వ్యూతో ఆయన మళ్లీ తన గళాన్ని వినిపించారు.