ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

Andhra
Advertisement
  • నెల్లూరు, కర్నూలు సహా 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
  • మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు
  • వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరిక
  • ఈదురు గాలులు, మెరుపుల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • గురువారం తెనాలిలో అత్యధికంగా 29.4 మి.మీ. వర్షపాతం
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవవచ్చని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు.

ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే వేళ ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి గుంటూరు జిల్లా తెనాలిలో అత్యధికంగా 29.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ., తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ., గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మి.మీ., నెల్లూరు రూరల్‌ ప్రాంతంలో 20 మి.మీ. మేర వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Andhra PradeshAP Weather AlertRainfall in AP DistrictsAP Disaster Management AuthorityNellore Tirupati Rain UpdateThunderstorm Warning AP

More Telugu News

హైదరాబాద్‌లో మరో నియోపొలిస్.. మియాపూర్ భూములపై హెచ్‌ఎండీఏ మెగా ప్లాన్!

27 Nov, 08:56

ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పోస్టులు, దరఖాస్తు తేదీ.. పూర్తి వివరాలివే..!

27 Nov, 08:55

అప్పు తీర్చని వరుడు.. పెళ్లి మండపంలోకి వచ్చి నిలదీసిన యువతి.. పెళ్లిపీటలపై గందరగోళం!

27 Nov, 08:44

ఖాతాల్లోకి పింఛను నగదు జమ.. కొత్తగా 4.89 లక్షల మందికి లబ్ధి

27 Nov, 08:33

జడేజా, సిరాజ్‌లను ఎలా పక్కనబెడతారు? టీమిండియా సెలక్షన్స్‌పై మాజీ కెప్టెన్‌ విమర్శలు

27 Nov, 08:22

డేటా అక్కర్లేదా?.. ఇకపై వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లు మాత్రమే తీసుకోవచ్చు!

27 Nov, 08:08

పార్లమెంట్‌లో మ్యాజిక్ ఫిగర్‌పై ఉత్కంఠ: డీఎంకే, ఎన్సీపీ, వైసీపీలే కీలకం.. లెక్కలు తేలేదెలా?

27 Nov, 08:07

స్మార్ట్ 2 EV: రూ.5 లక్షల ప్రచారంలో నిజమెంత?.. అసలు ధర తెలిస్తే షాకవుతారు!

27 Nov, 07:50

ఆర్టీసీ బస్సులో ఊహించని ఘటన.. 73 మంది ప్రాణాలను కాపాడిన ప్రయాణికుడు!

27 Nov, 07:33

అదొక్కటే మా పాలిట చెడ్డ రోజు.. ఓటమిపై కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

27 Nov, 07:19

పసిడి పతనం.. గోల్డ్ లోన్ మార్కెట్‌కు గండం!.. వేలం, రికవరీల వైపు సంస్థల చూపు

27 Nov, 07:02

భారత్-కివీస్ రెండో టెస్ట్.. అరంగేట్రంలోనే వికెట్ తీసిన బ్రార్

27 Nov, 06:46

పీటర్సన్ స్పీడ్ ఛాలెంజ్‌లో స్మృతి మంధాన విధ్వంసం.. 37 బంతుల్లోనే సెంచరీ!

27 Nov, 06:33

317 కొట్టినా దక్కని విజయం: రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో భారత్‌కు షాక్.. ఫైనల్లోకి శ్రీలంక!

26 Nov, 22:48
..More Telugu News