గోల్డ్, క్యాష్ పాత చింతకాయ పచ్చడి: 40 ఫ్లాట్లలో చెప్పులు కొట్టేసిన వెరైటీ దొంగ.. సీసీటీవీ చూస్తే నవ్వులే!
Advertisement
- హౌరాలోని హౌసింగ్ సొసైటీలో 40 ఫ్లాట్ల పాదరక్షల చోరీ
- సుమారు రూ.1.2 లక్షల విలువైన బూట్లు, చెప్పుల అపహరణ
- తెల్లవారుజామున గోడ దూకి లోపలికి వచ్చిన దొంగ
- నిదానంగా షూ ర్యాక్స్ వెతికి ఎర్రటి సంచుల్లో నింపుకున్న వైనం
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
దొంగతనం అంటే బంగారం, నగదు, ఖరీదైన గ్యాడ్జెట్లు కొట్టేయడం చూస్తుంటాం. కానీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో మాత్రం ఓ దొంగ రూటు మార్చి వింత చోరీకి తెరతీశాడు. షిబ్‌పూర్‌లోని హ్యాపీ గార్డెన్ హౌసింగ్ సొసైటీలోకి తెల్లవారుజామున చొరబడిన సదరు ఘనుడు.. ఏకంగా 40 ఫ్లాట్ల ముందున్న చెప్పులు, బూట్లను మూటగట్టుకుని పరారయ్యాడు. ఉదయం లేచి చూసేసరికి గుమ్మం ముందు పాదరక్షలు కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు లబోదిబోమన్నారు.
నవంబర్ 22న తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య ఈ విచిత్ర సంఘటన జరిగింది. తెల్లటి చొక్కా, ప్యాంటు ధరించి, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దర్జాగా వచ్చిన ఆ అగంతకుడు.. సెక్యూరిటీ కళ్లుగప్పి ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చాడు. ముందుగా ‘బి’ బ్లాక్‌ను, ఆ తర్వాత ‘ఏ’ బ్లాక్‌ను టార్గెట్ చేశాడు. ఫ్లాట్ల బయట ఉన్న షూ ర్యాక్స్‌ను తీరిగ్గా తనిఖీ చేస్తూ.. బ్రాండెడ్ స్నీకర్లు, ఖరీదైన చెప్పులు, ఫార్మల్ షూలను ఎంచక్కా ఎంపిక చేసుకుని ఎర్రటి సంచుల్లో నింపుకున్నాడు. ఇలా సుమారు రూ.1.2 లక్షల విలువైన పాదరక్షలను సంచుల్లో సర్దుకుని, మళ్లీ వచ్చిన దారినే గోడ దూకి చెక్కేశాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
రెండు నెలల వ్యవధిలోనే సొసైటీలోకి రెండోసారి ఇలాంటి చొరబాటు జరగడం గమనార్హం. గతంలో వచ్చినప్పుడు ఏమీ దొంగిలించకుండా వెళ్లిన వ్యక్తి, ఈసారి భారీ ఎత్తున 'షూ షాపింగ్' చేసి పోయాడని స్థానికులు వాపోతున్నారు. వృద్ధులు ఎక్కువగా ఉండే ఈ కాంప్లెక్స్‌లో భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసి, కేసు నమోదు చేసి నైట్ పెట్రోలింగ్ పెంచాలని కోరారు.