ఈజిప్టులో ఆయిల్ ట్యాంకర్ పేలుడు.. 31 మంది సజీవ దహనం
Advertisement
- ఈజిప్టు రాజధాని కైరోలో ఘటన
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి పేలడంతో ప్రమాదం
- ప్రమాదంలో 27 వాహనాలు పూర్తిగా దగ్ధం
- ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
- క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటన
ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చమురు ట్యాంకర్ బోల్తా పడి పేలిపోవడంతో సుమారు 31 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనతో కైరో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం కైరోలోని అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డుపై పెట్రోలియం ఉత్పత్తులను తరలిస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం భారీ పేలుడు సంభవించి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ మంటలు క్షణాల్లో సమీపంలోని వాహనాలకు వ్యాపించడంతో పెను విషాదం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో సుమారు 27 కార్లు సహా ఇతర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే 39 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అధికారులను ఆదేశించారు.
ఈ దుర్ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, ప్రధాని మొస్తఫా మడ్బౌలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి, రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.