స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విలీనంపై ఏకపక్ష నిర్ణయాలు వద్దు: కవిత

Telangana
Advertisement
  • విద్యారంగంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించిన కవిత
  • స్టేక్‌హోల్డర్లతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాతే ముందడుగు వేయాలని డిమాండ్
  • కొత్త విధానంతో తల్లిదండ్రులపై మరింత ఫీజుల భారం పడుతుందని ఆందోళన
ఇంటర్మీడియట్ బోర్డును ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. విద్యారంగానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు, జూనియర్ కాలేజీలు, పాఠశాల యాజమాన్యాలు, విద్యావేత్తలతో సమగ్ర చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే ప్రభుత్వం ఎలాంటి అడుగైనా వేయాలన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసే ప్రతిపాదనను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే, విద్యారంగానికి సంబంధించిన ఇలాంటి కీలక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియపై స్పష్టత కొరవడిందని చెబుతూ... "స్కూల్ విద్యలో ఇంటర్‌ను విలీనం చేస్తారా? లేక ఇంటర్ విద్యలో పాఠశాల విద్యను కలుపుతారా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. 

9, 10, 11, 12 తరగతుల విధానం వస్తే తల్లిదండ్రులపై మరింత భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే ఇంటర్ విద్య కోసం రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, నిధుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఆమె తప్పుబట్టారు. కేంద్రం నుంచి కరవు సహాయం తీసుకురావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. కరవు ప్రభావిత మండలాలపై ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహించాలని, రైతులకు పంటల ధరలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kalvakuntla KavithaIntermediate Education MergerTelangana School Education

More Telugu News

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట పీఎస్.. సమస్య నోటితో చెబితే ఫిర్యాదు కాపీ రెడీ!

25 Nov, 17:42

ఆ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర లేదు.. భూమన వ్యాఖ్యలు నిరాధారం: మంత్రి ఆనం

25 Nov, 17:38

భారత్ అభివృద్ధిని ప్రపంచంలోని ఏ శక్తీ కోరుకోవడం లేదు: మోహన్ భగవత్

25 Nov, 17:27

రాజమౌళి 'వారణాసి' విడుదల వాయిదా పడనుందా?

25 Nov, 17:22

తిరుమలలో తమిళనాడు భక్తుడు హఠాన్మరణం

25 Nov, 17:18

‘‘ఆట హాస్యాస్పదంగా మారింది’’.. వైభవ్‌ రికార్డుపై మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు

25 Nov, 17:07

మహిళ ఆత్మహత్యను రాజకీయం చేయడం హేయమైన చర్య: భూమనపై భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్

25 Nov, 17:04

ఆంజనేయస్వామి గుడి తరలింపు అలైన్‌మెంట్ వైసీపీ హయాంలోనే జరిగింది: గద్దె రామ్మోహన్ రావు

25 Nov, 17:02

నా పిలుపుతో 50 శాతం మంది విద్యావంతులు పోటీలో నిలిచారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

25 Nov, 16:47

మార్కెట్లకు లాభాల పంట.. 1500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్.. 25,800 దాటిన నిఫ్టీ

25 Nov, 16:44

వృద్ధాప్యానికి ఏఐతో చెక్.. మనిషి 1400 ఏళ్లు బతకడం సాధ్యమేనా?

25 Nov, 16:40

మైటీడీపీ’ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది: నారా లోకేశ్

25 Nov, 16:29

కీబోర్డులో అన్ని బటన్లు చిన్నవిగా ఉంటే.. స్పేస్‌బార్ మాత్రమే పొడవుగా ఎందుకుంటుందో తెలుసా?

25 Nov, 16:21

డాలర్‌పై రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి మారకం విలువ.. ఈ ఆర్థిక సంవత్సర నష్టాలన్నీ కవర్!

25 Nov, 16:18
..More Telugu News