కృష్ణా నీళ్ల పంచాయితీ.. రేవంత్‌పై కవిత ఫైర్

Andhra
Advertisement
  • తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కవిత ఆరోపణ
  • అనుమతులు లేకుండా ఏపీ నీటిని తరలిస్తోందని విమర్శ
  • సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి
కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా నీటిని మళ్లించుకుపోతోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో చొరవ చూపి, న్యాయబద్ధమైన నీటి పంపిణీకి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆమె విజ్ఞప్తి చేశారు.

సోమవారం రాజమహేంద్రవరంలో ఓ మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి గట్టిగా వ్యవహరించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, ప్రజల ఆగ్రహం ఏపీ నేతలపై కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ మార్గదర్శకాలను ఇరు రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని, చట్టబద్ధంగా, శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Kalvakuntla KavithaRevanth ReddyChandrababu NaiduKrishna River water disputeTelangana Andhra Pradesh water rowKRMB meeting

More Telugu News

లక్షల డాలర్లకు ఆశపడి.. దేశ రహస్యాలు అమ్మేసిన చైనా అధికారికి మరణశిక్ష!

24 Nov, 07:32

రూ.1.27 కోట్ల ప్యాకేజీ.. పెళ్లికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తిప్పలు!

24 Nov, 07:16

రష్యాలో హైదరాబాద్ వ్యాపారి అరెస్టు.. కేంద్రం జోక్యం కోరుతున్న కుటుంబం

24 Nov, 07:08

26న తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

24 Nov, 07:00

కృష్ణా జలాలను బీఆర్ఎస్ ఏపీకి తాకట్టు పెట్టింది.. 2022 జీవోను బయటపెట్టిన రేవంత్

24 Nov, 06:57

ఎలాన్ మస్క్ ఏఐ 'గ్రోక్'పై దావా.. అశ్లీల చిత్రాలు సృష్టిస్తోందని ఆరోపణ

24 Nov, 06:51

హింస వీడండి, జనజీవనంలో కలవండి: మావోయిస్టు అగ్రనేతలకు డీజీపీ పిలుపు

24 Nov, 06:44

పుణ్య పరీక్షలో ఫెయిల్!.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయిన భక్తుడు.. వైరల్ వీడియో

24 Nov, 06:38

500 ప్రాజెక్టులను ఓడించిన తెలంగాణ పదో తరగతి బాలికల స్మార్ట్ హెల్మెట్

24 Nov, 06:24

హైదరాబాద్‌లో 'ట్రాఫిక్ రద్దీ ఛార్జీలు'?.. ఐటీ కారిడార్‌లో పైలట్ ప్రాజెక్టు?

24 Nov, 06:19

దుబాయ్‌లో చీరకట్టులో సైక్లింగ్, రన్నింగ్ చేసిన మహిళా వ్యాపారవేత్త.. నెటిజన్ల ప్రశంసలు

23 Nov, 23:20

క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. వీడియో వైరల్

23 Nov, 23:07

షేవింగ్ చేసుకుంటుండగా నీళ్లు బంద్.. దేశాధ్యక్షుడి భవనంలోనూ తప్పని తిప్పలు

23 Nov, 22:54

అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. భారీగా లాభపడిన పసిడి, వెండి

23 Nov, 22:54
..More Telugu News