ఈ ఘన విజయం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది: కేశినేని చిన్ని

Andhra
Advertisement
  • విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
  • బెజవాడ డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ ఏకగ్రీవ ఎన్నిక
  • ప్రజల ఆదరణతోనే కూటమికి ఘన విజయం దక్కిందన్న కేశినేని చిన్ని
విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నూతన మేయర్‌గా జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా తొలుత మేయర్ వంగవీటి రాధాకృష్ణతో ప్రమాణం చేయించారు. అనంతరం నగరంలోని 86 మంది కార్పొరేటర్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నుపాటి కాంతిశ్రీని సభ్యులు డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రజల ఆదరణతో కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. విజయవాడలో మొదట మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, ఆ తర్వాత కార్పొరేటర్లు ప్రమాణం చేశారని తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. ఇంతటి భారీ విజయం వెనుక కూటమి నేతలు, కార్యకర్తల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు కూటమిని ఆశీర్వదించారని వివరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లకు గాను కూటమి ఏకంగా 76 స్థానాలను గెలుచుకుంది. ఇందులో టీడీపీ 53, జనసేన 19, బీజేపీ 4 స్థానాలు సాధించాయి. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో విజయవాడ నగరంలో కొత్త పాలన అధికారికంగా ప్రారంభమైంది.
Advertisement

సంబంధిత వార్తలు

Kesineni ChinniTDPVangaveeti RadhakrishnaJanasenaVijayawada MayorChennupati KanthisriVijayawada Deputy Mayor

More Telugu News

బుల్లెట్ రైలు ట్రయల్ రన్ కు ముహూర్తం ఫిక్స్.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్‌డేట్

23 Nov, 18:12

పుట్టపర్తిలో భజనలో పాల్గొన్న సాయిపల్లవి

23 Nov, 18:04

కాంగ్రెస్‌కు 90 సీట్లు ఎలా వస్తాయి?: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ప్రశ్న

23 Nov, 18:01

'గోల్డ్ స్పాట్' మళ్లీ వస్తోంది: హిట్అయిన ఆరెంజ్ డ్రింక్ ఎందుకు కనుమరుగైంది?

23 Nov, 17:42

వెస్ట్ బెంగాల్ పేరు మార్పునకు రంగం సిద్ధం

23 Nov, 17:41

ఒక్కొక్కరికి రూ.1 కోటి విలువైన 100 అడుగుల నోట్ల దండ.. యూపీ పెళ్లికొడుకులకు బావ బంపర్ కానుక

23 Nov, 17:23

సికింద్రాబాద్ నుంచి కాశీ, అయోధ్యలకు 'భారత్ గౌరవ్' రైలు.. తెలంగాణ, ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!

23 Nov, 17:11

'మయూఖ' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

23 Nov, 17:01

కూకట్‌పల్లిలో హుడా ట్రక్ పార్కింగ్ స్థలం వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈటల రాజేందర్ ధర్నా

23 Nov, 17:01

ఖాకీ చొక్కా వదిలి కార్పొరేట్ సూటు.. రిటైర్డ్ పోలీసులకు నెలకు భారీ ప్యాకేజీలు!

23 Nov, 16:57

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు 100 మిస్సైళ్ల ఇంధన ముడిసరుకు.. నౌకను పట్టుకున్న ఇండోనేషియా నేవీ

23 Nov, 16:54

రాబోయే రోజుల్లో డేటా ఆధారిత నిర్ణయాలే కీలకం అవుతాయి: సీఎం చంద్రబాబు

23 Nov, 16:49

దివంగత సైనికుడి కుమార్తె పెళ్లికి సైన్యమే కుటుంబమై వచ్చి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

23 Nov, 16:40

ఆస్ట్రేలియాలో భారతీయ కుటుంబంపై గుడ్లతో దాడి.. యువతి వీడియోతో వెలుగులోకి!

23 Nov, 16:35
..More Telugu News