"అలెక్స్, ఎక్కడున్నావు?".. ఎగిరిపోయిన చిలుక కోసం ఓ కుటుంబం ఆవేదన!
Advertisement
- వారణాసిలో తప్పిపోయిన పెంపుడు చిలుక అలెక్స్
- ఆచూకీ తెలిపిన వారికి రూ. 11 వేల రివార్డు ప్రకటన
- కాశీ వీధుల్లో ఫొటోలతో పోస్టర్లు అతికిస్తున్న కుటుంబం
- గతంలోనూ తప్పిపోయి మళ్లీ దొరికిన చిలుక
- అలెక్స్ దూరమవడంతో బెంగపెట్టుకున్న పెంపుడు శునకం
వారణాసిలోని దారానగర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు రామచిలుక తప్పిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతోంది. గత పదేళ్లుగా తమ ఇంట్లో ఓ సభ్యురాలిగా కలిసిపోయిన 'అలెక్స్' అనే ఆడ చిలుక కోసం వీధివీధినా గాలిస్తున్నారు. దాని ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించిన వారికి రూ. 11,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ నగరంలో పోస్టర్లు ఏర్పాటు చేశారు.
మౌర్య కుటుంబం ఇంట్లో నవంబర్ 16న టైల్స్ వేసే పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో యంత్రాల నుంచి వచ్చిన తీవ్రమైన శబ్దాలకు అలెక్స్ భయపడిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి పట్టుకునేలోపే అది అక్కడి నుంచి ఎగిరిపోయింది. వెంటనే పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా చిలుక ఆచూకీ లభించలేదు. దీంతో అరవింద్ మౌర్య, ఆయన కుమారుడు స్వయంగా రంగంలోకి దిగి కాశీలోని పలు సందులు, ప్రధాన వీధుల్లో అలెక్స్ ఫొటోతో కూడిన పోస్టర్లను అతికిస్తూ గాలిస్తున్నారు.
చిలుక కనిపించకుండా పోవడంతో తమ ఇల్లు కళ తప్పిందని కుటుంబ సభ్యురాలు శిఖా మౌర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో రోజూ ఉండే సందడి పూర్తిగా కరవైందని తెలిపారు. అలెక్స్‌తో ఎక్కువ సమయం గడిపే తమ పెంపుడు కుక్క కూడా తీవ్రమైన బెంగపెట్టుకుందని, నిస్సత్తువగా మారిపోయిందని కుటుంబ సభ్యులు వివరించారు.
అలెక్స్ ఇలా తప్పిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2019లో కూడా ఈ చిలుక ఇలాగే ఎగిరిపోగా, వారణాసిలోని ఖజూరి ప్రాంతంలో దొరికింది. ఆ సమయంలో దాన్ని తెచ్చిచ్చిన వ్యక్తికి కుటుంబం రూ. 5,100 బహుమతిగా అందించింది. ఈసారి కూడా అలెక్స్‌ను సురక్షితంగా చేర్చిన వారికి రూ. 11,000 నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తమ చిలుకను క్షేమంగా తీసుకొస్తే ఆ మొత్తాన్ని రూ. 21,000కి పెంచడంతో పాటు అదనంగా ఒక బహుమతిని కూడా అందజేస్తామని కుటుంబం స్పష్టం చేసింది. అలెక్స్ ఎవరికైనా చెట్లపై గానీ, ఇళ్ల పైకప్పులపై గానీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.