కొండగట్టులో అపురూప ఘట్టం.. ఆరు దశాబ్దాల తర్వాత అంజన్న దర్శన భాగ్యం
Advertisement
- విజయవంతంగా ముగిసిన చందనోత్సవ ప్రక్రియ
- డిసెంబర్ 29 వరకు భక్తులకు దర్శన భాగ్యం
- భద్రాచలం పట్టువస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ
- దర్శించుకున్న స్పీకర్, మంత్రులు, పలువురు ప్రముఖులు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అరుదైన చందనోత్సవం శుక్రవారం ముగిసింది. సుమారు 60 ఏళ్ల తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం లభించింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
గత ఆరు దశాబ్దాలుగా స్వామివారి మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందనం పొరను తొలగించే ప్రక్రియను ఆలయ అధికారులు, అర్చకులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 15న ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 18వ తేదీ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతిరోజూ హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా బంగారం, వెండి, చెక్క పరికరాలను వినియోగించి స్వామివారి చందనాన్ని తొలగించారు.
చందనాన్ని తొలగించిన అనంతరం పంచనదుల జలాలు, సముద్రపు నీటితో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టువస్త్రాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంప్రదాయబద్ధంగా ముందుగా అద్దంలో స్వామివారి రూపాన్ని ప్రతిబింబింపజేసి, ఆ తర్వాత అర్చకులు, భక్తుల దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్వామివారి నిజరూప దర్శనం డిసెంబర్ 29 వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందని అర్చకులు వెల్లడించారు. చివరిసారిగా 1965లో ఈ చందనోత్సవం జరగ్గా, సుమారు ఆరు దశాబ్దాల తర్వాత లభించిన ఈ అపురూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.