నా ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించేనా నీ పంచాయితీ?.. సీఎం రేవంత్‌ ప్రసంగంపై భగ్గుమన్న హరీశ్

Telangana
Advertisement
  • సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌ వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిచ్చారన్న హరీశ్‌
  • జనం లేక ఇతర జిల్లాల నుంచి తరలించినట్లు సీపీనే స్వయంగా చెప్పారని వెల్లడి
  • కరవు నుంచి దృష్టి మళ్లించేందుకే సభలో సీఎం అసత్యాలు, దూషణలకు దిగారని ఆరోపణ
  • దేవాదుల వద్ద మోటార్లు పూర్తిస్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రశ్న
  • అబద్ధాల ప్రసంగాలు చేస్తున్నందుకు రేవంత్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్
సిద్దిపేటలో నిర్వహించిన ఇందిరమ్మ జీవిత బీమా సభ అట్టర్ ప్లాప్ కావడంతో సీఎం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసలు సభకు వచ్చిన పథకం గురించి మాట్లాడకుండా తన ఎత్తు, కేటీఆర్ గడ్డం వంటి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడానికే రేవంత్ వచ్చారా? అని ప్రశ్నించారు. సొంత జిల్లాలో జనం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించిన విషయాన్ని అక్కడి పోలీస్ కమిషనరే స్వయంగా చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సభలో బూతులు, అబద్ధాలు వల్లెవేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీటిని ఎత్తిపోసేందుకు పంపులు, మోటార్లు లేవంటూ సీఎం చెప్పడం పచ్చి మోసమని హరీశ్‌ ఆరోపించారు. అలాంటప్పుడు దేవాదుల దగ్గర మోటార్లను పూర్తిస్థాయిలో ఎందుకు నడపడం లేదని, శ్రీశైలం నుంచి కేటాయించిన నీటిని ఎందుకు తోడలేకపోతున్నారని నిలదీశారు. కృష్ణా నదిలో రాష్ట్రానికి రావాల్సిన 299 టీఎంసీలను సైతం ఉపయోగించుకోలేని అసమర్థ స్థితిలో ఈ పాలన ఉందని విమర్శించారు. ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదనలు వినిపించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని, సభలో మాట్లాడిన పచ్చి అబద్ధాలకు గానూ సీఎం ముక్కు నేలకు రాయాలని హరీశ్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించే పనిలో పడి తెలంగాణ సాగునీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కృష్ణా జలాల దోపిడీకి కాంగ్రెస్ సర్కారే ప్రత్యక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

Harish RaoRevanth ReddySiddipetKrishna River water disputeBRS Congress conflictTelangana irrigation rights

More Telugu News

డ్రెస్ కోడ్ పేరుతో అయ్యప్ప స్వామికి నో ఎంట్రీ.. హైదరాబాద్‌ టీసీఎస్ వద్ద భగ్గుమన్న నిరసన!

20 Nov, 15:40

కేసీఆర్ నా కథలో రావణాసురుడు.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా లీడర్: సీఎం రేవంత్

20 Nov, 15:33

రేవంత్ రెడ్డి పాలనలో క్రైస్తవులు, దళితులపై దాడులు పెరిగాయి: కేఏ పాల్

20 Nov, 15:31

శత్రువులను గడగడలాడించే అమెరికా ఫైటర్ జెట్‌కు.. 256 ఎంబీ మెమరీ కార్డు కావాలట!

20 Nov, 15:22

స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

20 Nov, 15:16

ఐఎస్ఐ అతిథిగా దావూద్ రాచభోగాలు.. పాక్‌లో డాన్ రహస్య జీవితాన్ని బయటపెట్టిన మాజీ ఎఫ్‌బీఐ అధికారి!

20 Nov, 15:05

చుక్కా రామయ్య 101వ జన్మదినం నేడు.. వేలాదిమందిని ఐఐటీయన్లుగా తీర్చిదిద్దిన ఘనత

20 Nov, 15:04

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. అసలు వ్యూహం బయటపెట్టిన రికీ పాంటింగ్!

20 Nov, 14:59

రూ.10 కోట్ల బంగారంతో రామకథకు వచ్చిన బిహార్ 'గోల్డ్ మ్యాన్'

20 Nov, 14:59

'ఓం' - మూవీ రివ్యూ!

20 Nov, 14:58

సిరాజ్‌ను పక్కనపెట్టడంపై రాజకీయ దుమారం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

20 Nov, 14:45

ఏపీ నుంచి అరుణాచలానికి కార్తిగై దీపం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

20 Nov, 14:29

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

20 Nov, 14:28

సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక మత కోణమా? కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై గంభీర్ కోచ్ క్లారిటీ!

20 Nov, 14:22
..More Telugu News