సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిశాక విషాదం.. మహిళ మృతి

Telangana
Advertisement
  • హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సభ వద్ద విషాదం
  • సభ ముగిశాక బస్సుల మధ్య నలిగిపోయి మహిళ అక్కడికక్కడే మృతి
  • మృతురాలు హుస్నాబాద్ మండలానికి చెందిన కొమ్ము సారవ్వగా గుర్తింపు
  • బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు
హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ వద్ద విషాదం చోటుచేసుకుంది. సభ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళ, బస్సుల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ మండలం నగరానికి చెందిన కొమ్ము సారవ్వ (55) అనే స్వయం సహాయక బృందం సభ్యురాలు సీఎం సభకు హాజరయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ముఖ్యమంత్రి ప్రసంగం ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ సమయంలో బస్సులు త్వరగా వెళ్లాలనే తొందరలో డ్రైవర్లు వాహనాలను అజాగ్రత్తగా నడపడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సారవ్వ రెండు బస్సుల మధ్య చిక్కుకుని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సారవ్వ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ దుర్ఘటనపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Revanth ReddyHusnabad Public MeetingKommu SaravvaPonnam PrabhakarSiddipet Bus AccidentTelangana Government Ex-gratia

More Telugu News

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి ఇంట విషాదం

20 Nov, 12:04

'ప్రియమైన స్నేహితురాలికి' బర్త్‌డే విషెస్.. మళ్లీ వార్తల్లో లలిత్ మోదీ, సుస్మితా సేన్

20 Nov, 12:01

వాన్ గో పెయింటింగ్‌కు రికార్డు ధర.. వేలంలో రూ.1,773 కోట్లు!

20 Nov, 11:35

తీరం దాటిన 'అక్వాన్' తుపాను.. ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

20 Nov, 11:33

కివీస్‌పై జైస్వాల్, రాహుల్ జోరు.. 32 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!

20 Nov, 11:21

మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లపై ఈడీ మెరుపు దాడులు.. అరెస్ట్ చేసే అవకాశం

20 Nov, 11:15

'మిర్రర్ డైమెన్షన్'.. ఏఐ శిక్షణ కోసం నకిలీ ఇంటర్నెట్‌ను నిర్మించిన గూగుల్!

20 Nov, 11:09

అత్యవసరంగా నిర్ణయం తీసుకోండి.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు

20 Nov, 10:55

81 మంది నూతన జాతీయ కార్యదర్శలను నియమించిన కాంగ్రెస్.. 50 శాతం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు

20 Nov, 10:45

పులివెందులలో టెన్షన్.. ఎంపీ అవినాశ్‌ రెడ్డి కాన్వాయ్‌పై దాడి

20 Nov, 10:43

ఉగ్రవాదులకు ప్లాన్లు ఇస్తున్న ఏఐ.. అమెరికా పరిశోధనలో షాకింగ్ నిజాలు

20 Nov, 10:39

భారత్ ఇప్పుడు 'సైడ్ ప్లేయర్'.. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం!

20 Nov, 10:38

నీటి హక్కులపై రాజీ లేదు.. చుక్క నీటిని కూడా ఏపీకి వదులుకోం: మంత్రి ఉత్తమ్

20 Nov, 10:17

పాక్ అధ్యక్షుడే ఫిదా అయ్యారు.. ధోనీ గురించి రాజీవ్ శుక్లా చెప్పిన ఆసక్తికర ఘటన!

20 Nov, 10:14
..More Telugu News