కోమటిరెడ్డి మీ అనుచరుడు.. అన్నీ ఆయనే చూసుకుంటారు: నితిన్ గడ్కరీతో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
- హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 9 కీలక ప్రాజెక్టుల జాబితా సమర్పించిన కోమటిరెడ్డి
- వేదికపై ఆత్మీయ వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సు కొనసాగుతోంది. ఈ ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన, ఆత్మీయ వాతావరణం కనిపించింది.
కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రహదారుల నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించి కీలక ప్రాజెక్టుల జాబితాను కేంద్ర మంత్రికి సమర్పించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడం, హైదరాబాద్-శ్రీశైలం 61 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు మొత్తం 9 ప్రధాన ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయన కేంద్రం ముందు ఉంచారు.
అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి అందించిన ప్రాజెక్టుల జాబితాను ప్రస్తావిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. సీఎం మాట్లాడుతూ.. "నా సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మన రాష్ట్ర అవసరాల పెద్ద జాబితానే మీకు ఇచ్చారు. నేను వాటిని మళ్లీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి గారు మీ శ్రేయోభిలాషి, మీ అనుచరుడు, మీ వీరాభిమాని. ఆయనే అన్నీ చూసుకుంటారు. వాటి గురించి నేను పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు" అని వ్యాఖ్యానించారు. దీంతో గడ్కరీతో సహా సభలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
రహదారుల అభివృద్ధి ద్వారానే ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు నవంబర్ 22 వరకు కొనసాగనుంది.