టాక్స్ తగ్గించాం.. మరి జీతాలు పెంచారా?: భారత పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సూటి ప్రశ్న!

National
Advertisement
  • ఫిక్కీ సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలను ప్రశ్నించిన ప్రధాని మోదీ
  • సంస్కరణల ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చూపాలని సూచన
  • ఉద్యోగుల వేతనాలను ఎంత పెంచారో పరిశ్రమలు నిరూపించుకోవాలని వెల్లడి
  • దేశీయ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఇవ్వాలని ఆదేశం
  • ఫార్మా ఏపీఐలు, స్టీల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని పిలుపు
కార్పొరేట్ పన్నుల తగ్గింపు, పలు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పరిశ్రమలు ఎంతమందికి కొత్తగా ఉపాధి కల్పించాయి? ఉద్యోగుల వేతనాలను ఎంతమేర పెంచాయి? అంటూ భారత పారిశ్రామిక రంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నించారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్నుల తగ్గింపు, నిబంధనల సరళీకరణ, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల వంటి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని గుర్తుచేశారు. ఆ ఫలాలను ఉద్యోగాల సృష్టి, మెరుగైన వేతనాల రూపంలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత పరిశ్రమలపైనే ఉందని స్పష్టం చేశారు.

దేశ సర్వతోముఖాభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, పారిశ్రామికవేత్తలు సైతం ఈ ప్రగతి ప్రయాణంలో సమాన భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంస్థలే సొంతంగా నిర్దిష్ట వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతిదానికీ ప్రభుత్వంపైనే ఆధారపడవద్దని హితవు పలికారు. విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులకే అత్యున్నత నాణ్యతను కేటాయిస్తూ 'ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ' పేరిట ప్రచారం చేయడంపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ వినియోగదారులకు అందించే నాణ్యమైన వస్తువులనే భారతీయ పౌరులు కూడా పొందే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. దేశీయ మార్కెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు.

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. ప్రపంచానికే ఫార్మసీ హబ్ గా పేరుగాంచిన భారత్.. కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై బిలియన్ల డాలర్లు వెచ్చించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమృద్ధిగా ముడి వనరులు ఉన్నప్పటికీ అల్యూమినియం, స్టీల్ రంగాల్లో ప్రత్యేక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తగదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎగుమతుల వాటా కేవలం 2 నుంచి 2.5 శాతానికే పరిమితం కావడంపై దృష్టి సారించాలని, గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వర్గాలకు సూచించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Narendra ModiFICCI Annual General MeetingIndian IndustrialistsCorporate Tax ReductionJob Creation IndiaSalary Hike News

More Telugu News

నా పేరు వాడితే మైలేజ్.. అందుకే కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు: సజ్జనార్

19 Nov, 16:35

స్టాలిన్ పై గెలిచిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

19 Nov, 16:28

భారత బ్యాడ్మింటన్ రంగంలో నయా సంచలనం.. మాజీ ఒలింపిక్ ఛాంపియన్‌కు షాకిచ్చిన 19 ఏళ్ల రక్షిత రామ్‌రాజ్

19 Nov, 16:15

పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట బీటెక్ రవి ధర్నా

19 Nov, 16:14

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ విషప్రచారం చేస్తోంది: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

19 Nov, 16:00

జగన్ ఆస్తుల కేసుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

19 Nov, 15:59

కష్టాలు తట్టుకుని నిలబడిన నిజమైన హీరో కాంతారావు: తమ్మారెడ్డి

19 Nov, 15:50

దర్శకుడిగా రామ్ పోతినేని సరికొత్త ప్రయాణం.. పురుషుల దినోత్సవం వేళ 'లోన్ వోల్ఫ్' పోస్టర్ వైరల్!

19 Nov, 15:46

రూ.7.5 లక్షల కోట్ల పండగ.. పెళ్లిళ్ల సీజన్‌లో భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జోష్!

19 Nov, 15:43

తాతకు తగ్గ మనవడు.. రజనీకాంత్, యాత్ర స్టైలిష్ పోజు నెట్టింట వైరల్!

19 Nov, 15:37

తెలుగు సినిమాలకు దూరం కావడంపై క్లారిటీ ఇచ్చిన నటి శ్రీలీల

19 Nov, 15:33

కిలో చికెన్ రూ.99కే ఇస్తామన్నారు.. ఇక చూస్కోండి!

19 Nov, 15:30

తెలంగాణలో ఏడుగురు అన్నదమ్ముల దోపిడీపై విచారణ ఏదీ?: కేఏ పాల్ ప్రశ్న

19 Nov, 15:29

గెలిచిందెవరు, ఓడిందెవరు? రాష్ట్ర ప్రజలకు విజయసాయిరెడ్డి క్విజ్

19 Nov, 15:05
..More Telugu News