జగన్ ఆస్తుల కేసుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

Andhra
Advertisement
  • వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ ఈడీ, హరిరామజోగయ్య పిటిషన్లు
  • న్యాయ ప్రక్రియ 15 ఏళ్లుగా సాగుతోందన్న ఈడీ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసుల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 

ఈ కేసుల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు మాజీ ఎంపీ హరిరామజోగయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంలో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. సీబీఐ కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల్లో ఇప్పటివరకు దాదాపు 150కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని, దీనివల్ల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులకు సంబంధించి సీబీఐ 11 ఛార్జిషీట్లు, ఈడీ 9 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేశాయి.

మరోవైపు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని హరిరామజోగయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు... జగన్ కేసుల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర వివరాలతో స్టేటస్ రిపోర్టు అందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyTelangana High CourtDisproportionate Assets CasesEnforcement DirectorateCBI Status ReportHarirama Jogaiah Petition

More Telugu News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ విషప్రచారం చేస్తోంది: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

19 Nov, 16:00

కష్టాలు తట్టుకుని నిలబడిన నిజమైన హీరో కాంతారావు: తమ్మారెడ్డి

19 Nov, 15:50

దర్శకుడిగా రామ్ పోతినేని సరికొత్త ప్రయాణం.. పురుషుల దినోత్సవం వేళ 'లోన్ వోల్ఫ్' పోస్టర్ వైరల్!

19 Nov, 15:46

రూ.7.5 లక్షల కోట్ల పండగ.. పెళ్లిళ్ల సీజన్‌లో భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జోష్!

19 Nov, 15:43

తాతకు తగ్గ మనవడు.. రజనీకాంత్, యాత్ర స్టైలిష్ పోజు నెట్టింట వైరల్!

19 Nov, 15:37

తెలుగు సినిమాలకు దూరం కావడంపై క్లారిటీ ఇచ్చిన నటి శ్రీలీల

19 Nov, 15:33

కిలో చికెన్ రూ.99కే ఇస్తామన్నారు.. ఇక చూస్కోండి!

19 Nov, 15:30

తెలంగాణలో ఏడుగురు అన్నదమ్ముల దోపిడీపై విచారణ ఏదీ?: కేఏ పాల్ ప్రశ్న

19 Nov, 15:29

గెలిచిందెవరు, ఓడిందెవరు? రాష్ట్ర ప్రజలకు విజయసాయిరెడ్డి క్విజ్

19 Nov, 15:05

ఏపీలో 3 ఎకనమిక్ రీజియన్ల ప్రణాళికలు సిద్ధం.. రూ.4.6 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు సమీక్ష

19 Nov, 14:52

‘టైమ్ 100 నెక్స్ట్-ఇండియా’ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

19 Nov, 14:47

హరీశ్ రావు అవినీతిపై చర్యలేవి?: సీఎంఓకు పంపిన లేఖలు 'ఎక్స్'లో పంచుకున్న కవిత

19 Nov, 14:44

సర్పంచి పదవికి నామినేషన్ వేసిన ఏపీ మంత్రి అర్ధాంగి

19 Nov, 14:35

ఆ బగ్ వల్లే అంత గందరగోళం.. మైక్రోసాఫ్ట్ వైఫల్యాన్ని ఒప్పుకున్న సత్య నాదెళ్ల

19 Nov, 14:20
..More Telugu News