రెండో పెళ్లి ద్వారా జన్మించిన పిల్లలకూ తల్లి పేరిట ఉన్న ఆస్తిలో వారసత్వ హక్కు ఉంటుంది: సుప్రీంకోర్టు

National
Advertisement
  • మహిళకు సంపూర్ణ యాజమాన్య హక్కులుంటే ఆమె వారసులకే ఆస్తి దక్కుతుందని స్పష్టత
  • హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 14(1) ప్రకారం పరిమిత హక్కులు సంపూర్ణంగా మారుతాయని వెల్లడి
  • మొదటి భర్త కుటుంబ ఆస్తిలో రెండో వివాహం పిల్లలకు వాటా
మొదటి భర్త కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తిపై హిందూ మహిళకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభిస్తే, ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలు కూడా ఆ ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని వ్యవసాయ భూమి వారసత్వానికి సంబంధించిన వివాదంలో మొదటి భర్త కుటుంబీకుల వాదనను తోసిపుచ్చుతూ, మహిళ రెండో పెళ్లి కుమారులకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఈ వివాదం వివరాల్లోకి వెళితే... ఖజానో అనే మహిళకు మొదటి భర్త మౌజీ రామ్, కుమారుడు రామ్ చందర్ మరణానంతరం సుమారు 45 బిగాల వ్యవసాయ భూమి లభించింది. ఆ తర్వాత ఆమె బాల్‌కిషన్‌ను రెండో వివాహం చేసుకోగా... చంద్ రామ్, చందర్ భాన్ జన్మించారు. ఖజానో మరణం తర్వాత మొదటి భర్త కుటుంబీకులు ఆ భూమి తమ పూర్వీకులదని వాదించగా, రెండో పెళ్లి ద్వారా పుట్టిన కుమారులు వారసత్వ హక్కును కోరారు.

సుల్తాన్ సింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ కమిషనర్ కేసులో న్యాయస్థానం ఈ అంశాన్ని లోతుగా పరిశీలించింది. హిందూ వారసత్వ చట్టం 1956 అమల్లోకి రాకముందే ఖజానో ఆ భూమిని అనుభవిస్తున్నారని, సెక్షన్ 14(1) ప్రకారం ఆమెకున్న పరిమిత హక్కులు కాస్తా సంపూర్ణ యాజమాన్య హక్కులుగా మారాయని కోర్టు పేర్కొంది. దీంతో ఆమె ఆ ఆస్తికి తాత్కాలిక సంరక్షకురాలిగా కాకుండా పూర్తి స్థాయి స్వతంత్ర యజమానిగా గుర్తింపు పొందారని వివరించింది.

ఢిల్లీ భూ సంస్కరణల చట్టం 1954 నిబంధనల ప్రకారం ఆమె మరణించే నాటికి ఉన్న వ్యక్తిగత చట్టాల ఆధారంగా చట్టబద్ధ వారసులైన చంద్ రామ్, చందర్ భాన్‌లకే ఆ భూమి దక్కుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనే మూలాల కంటే, సదరు మహిళ మరణించే సమయానికి ఆ ఆస్తిపై ఆమెకున్న హక్కు స్వభావమే ప్రధానమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Advertisement

సంబంధిత వార్తలు

Supreme CourtHindu Succession ActProperty Inheritance RightsSecond Marriage ChildrenHindu Woman Property RightsSection 14 Hindu Succession Act

More Telugu News

ఆ బగ్ వల్లే అంత గందరగోళం.. మైక్రోసాఫ్ట్ వైఫల్యాన్ని ఒప్పుకున్న సత్య నాదెళ్ల

19 Nov, 14:20

సిరాజ్‌ను అందుకే తుది జట్టు నుంచి తప్పించాం.. కోచ్‌ కోటక్‌ వివరణ!

19 Nov, 14:13

పన్నూన్‌ కేసులో అమెరికా కోర్టు సంచలన ఆదేశం.. అజిత్‌ దోవల్, గోయల్‌కు సమన్లు!

19 Nov, 14:10

కొబ్బరికాయ పండు కాదు.. నూనెగింజ: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

19 Nov, 14:04

పెళ్లైనా కానట్టుగా నటించే కపుల్స్ కథ .. 'Mr&Mrs ఆఫీస్'

19 Nov, 13:41

రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది: మహేశ్ గౌడ్

19 Nov, 13:25

గర్భంతో సమంత చేసిన ఆ ప్రత్యేక పూజ ఏంటి?: ఆ వైదిక క్రతువు ప్రత్యేకత ఇదే..!

19 Nov, 13:18

ఒక్క రాత్రిలో 4,250 మంది కోటీశ్వరులు.. ఆంత్రోపిక్ ఐపీవోతో కాసుల వర్షం!

19 Nov, 12:43

పాములపాడు ఎంపీపీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి గృహనిర్బంధం

19 Nov, 12:41

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం కీలక నిర్ణయం

19 Nov, 12:40

సీజన్‌లోనూ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో భారీ పతనం!

19 Nov, 12:38

విద్యాసాగర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

19 Nov, 12:30

ఫాంటసీ టచ్ తో సాగే ఫ్యామిలీ సిరీస్ ..'లవ్ ఆల్వేస్'

19 Nov, 11:59

తొలి రోజే న్యూజిలాండ్ రివర్స్ ఎటాక్: బుమ్రా దెబ్బకొట్టినా నిలబడ్డ కివీస్ మిడిలార్డర్!

19 Nov, 11:54
..More Telugu News