పెళ్లైనా కానట్టుగా నటించే కపుల్స్ కథ .. 'Mr&Mrs ఆఫీస్'
Advertisement
- తమిళంలో రూపొందిన సిరీస్
- 100 ఎపిసోడ్స్ గా రూపొందిన కంటెంట్
- ప్రధానమైన పాత్రలో స్మేహా మేఘలై
- ఈ నెల 18 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- తెలుగులోనూ అందుబాటులోకి
ఆ మధ్య తమిళంలో 'ఆఫీస్' అనే ఒక సిరీస్ రూపొందింది. వివిధ భాషల్లో అనువాదమైంది. ఆ సిరీస్ లో 'ఇందు' పాత్రలో నటించిన ' స్మేహా మణిమేఘలై' యూత్ మనసులు దోచేసింది. చక్కని కనుముక్కుతీరుతో ఆకట్టుకుంటుంది. నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీ నుంచి వచ్చిన మరో సిరీస్ 'Mr&Mrs ఆఫీస్'. జగన్ భాస్కరన్ నిర్మించిన ఈ సిరీస్ కి అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించాడు. 100 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ నుంచి, ఈ బుధవారం 4 ఎపిసోడ్స్ వదిలారు. జియో హాట్ స్టార్ లో ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి.
కథ విషయానికి వస్తే .. అరవింద్ - ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పేరెంట్స్ వైపు నుంచి మద్దతు లేకపోవడం వలన, ఇద్దరూ ఆ కుటుంబాలకు దూరమవుతారు. ఒక చిన్న రూమ్ రెంట్ కి తీసుకుని, అద్దె కట్టలేక అవస్థలు పడుతుంటారు. కన్నవాళ్లకు తాను సాయం చేస్తున్న విషయం తెలియకుండా అరవింద్, కన్నవాళ్లకు తన కష్టం చెప్పుకోకుండా ఐశ్వర్య ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో అరవింద్ ఆఫీస్ లోనే ఐశ్వర్య జాబ్ సంపాదిస్తుంది.
అయితే ఒకే కుటుంబానికి సంబంధించినవారికి గానీ, బంధువులకు గాని జాబ్ ఇవ్వడం ఆ సంస్థ చైర్మన్ చంద్రబోస్ కి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అందువలన తాము భార్యాభర్తలమనే విషయం ఆఫీసులో తెలియకుండా అరవింద్ - ఐశ్వర్య జాగ్రత్తపడతారు. తమ ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఆఫీసులో నటించడానికి వాళ్లు ఎలాంటి అవస్థలు పడతారు? చివరి వరకూ వాళ్లు ఆ నిజాన్ని దాచగలిగారా లేదా? అనేది మిగతా కథ. చూస్తుంటే ఈ సిరీస్ కూడా దూసుకుపోయేలానే కనిపిస్తోంది మరి.