యాపిల్ మ్యాప్స్.. సరికొత్త ఫీచర్లతో భారత్‌లో రీడిజైన్.. తెలుగులోనూ సేవలు!

Technology
Advertisement
  • భారత్‌లో రీడిజైన్ చేసిన సరికొత్త యాపిల్ మ్యాప్స్ విడుదల
  • తెలుగు సహా పలు భారతీయ భాషల్లో డ్యూయల్ లాంగ్వేజ్ సపోర్ట్
  • దేశవ్యాప్తంగా 300కు పైగా ప్రముఖ కట్టడాలకు 3డీ వ్యూ
  • భారతీయ రహదారులకు అనుగుణంగా కొత్త నావిగేషన్ సిస్టమ్
  • హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పబ్లిక్ ట్రాన్సిట్ అప్‌డేట్స్
భారతీయ వినియోగదారుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ 'యాపిల్ మ్యాప్స్' (Apple Maps) సర్వీసును సరికొత్త రూపంలోకి తీసుకొచ్చింది. దేశీయ రోడ్ల పరిస్థితులు, స్థానిక ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతమైన నావిగేషన్, ఇంటరాక్టివ్ స్ట్రీట్-లెవల్ ఇమేజరీ, 3డీ ల్యాండ్‌మార్క్స్‌తో కూడిన సరికొత్త మ్యాప్స్ అనుభవాన్ని బుధవారం అధికారికంగా విడుదల చేసింది.

ఈ తాజా అప్‌డేట్‌లో భారతీయ భాషలకు విస్తృత ప్రాధాన్యం కల్పించారు. యూజర్ల సెట్టింగ్స్, లొకేషన్ ఆధారంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, పంజాబీ, ఒడియా, ఉర్దూ భాషల్లో పేర్లను చూపే డ్యూయల్-లాంగ్వేజ్ లేబుల్స్ సదుపాయాన్ని చేర్చారు. భారతీయ రహదారులపై వీధుల పేర్లు స్పష్టంగా లేని చోట్ల కూడా సులభంగా దారి తెలుసుకునేందుకు వీలుగా.. సమీపంలోని గుర్తింపు పొందిన ప్రదేశాలు (ల్యాండ్‌మార్క్స్) ఆధారంగా దిశానిర్దేశం చేసేందుకు ‘నేచురల్ లాంగ్వేజ్ గైడెన్స్’ను తీసుకొచ్చారు.

సరికొత్త మ్యాప్స్ విడుదలపై యాపిల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ మాక్స్ ముల్లర్ స్పందిస్తూ.. "ప్రపంచాన్ని అన్వేషించడానికి, సులభంగా ప్రయాణించడానికి యాపిల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగపడుతుంది. సరికొత్తగా తీర్చిదిద్దిన మ్యాప్స్‌ను భారత్‌లోని మరింత మంది యూజర్లకు అందించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది" అని పేర్కొన్నారు.

భారత్‌లో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు పలు ఆధునిక ఫీచర్లను ఇందులో చేర్చారు. సరైన లేన్‌లో వెళ్లేందుకు సాయపడే లేన్ గైడెన్స్, ఒకే ట్రిప్‌లో గరిష్ఠంగా 15 గమ్యస్థానాలను జోడించుకునే మల్టీ-స్టాప్ రూటింగ్, ప్రయాణ సమయాన్ని ఇతరులతో పంచుకునే ‘షేర్ ఈటీఏ’, సిరి (Siri) ద్వారా రోడ్డు ప్రమాదాలను రిపోర్ట్ చేసే ఆప్షన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం ప్రత్యేక రూట్ ప్లానింగ్‌ను యాపిల్ తీసుకొచ్చింది. అలాగే ఐఫోన్ కెమెరాను ఉపయోగించి నడిచేటప్పుడు సరైన దారి చూపే ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వాకింగ్ డైరెక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు భారత్‌లోని ప్రధాన ప్రాంతాలను వర్చువల్‌గా చూసేందుకు వీలుగా 'లుక్ అరౌండ్' (Look Around) పేరుతో స్ట్రీట్-లెవల్ ఇమేజరీని విడుదల చేశారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా 300కు పైగా ప్రసిద్ధ చారిత్రక, ప్రముఖ కట్టడాలను 3డీ రూపంలో వీక్షించే సదుపాయం కల్పించారు.

రైల్వే, మెట్రో ప్రయాణికులకు ఉపయోగపడేలా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్, పుణే నగరాల్లో పబ్లిక్ ట్రాన్సిట్ సేవలను జోడించారు. ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణించే వారు సైతం స్టేషన్లను గుర్తించడం, గమ్యస్థానానికి చేరువైనప్పుడు అలర్ట్స్ అందుకోవడం వంటి సదుపాయాలను పొందవచ్చు. సైక్లింగ్ చేసే వారి కోసం ఎత్తుపల్లాల (Elevation) వివరాలతో కూడిన రూట్స్, ప్రయాణికుల అలవాట్లను గుర్తించి ప్రత్యేక మార్గాలను సూచించే ‘ప్రిఫర్డ్ రూట్స్’ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

యూజర్ల వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు యాపిల్ తెలిపింది. మ్యాప్స్ వాడేందుకు ఎలాంటి సైన్-ఇన్ అవసరం లేదని, ఆన్-డివైస్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే ఫీచర్లు పనిచేస్తాయని వెల్లడించింది. యూజర్ లొకేషన్ వివరాలు సర్వర్లలో నమోదు కాకుండా పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ నయా మ్యాప్స్ ఫీచర్లు ఐఓఎస్ 27.2 (iOS 27.2), ఐపాడ్ ఓఎస్ 27.2, వాచ్ ఓఎస్ 27.2, మ్యాక్ ఓఎస్ 27.2 లేదా ఆ తర్వాతి వెర్షన్లు కలిగిన డివైజ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Apple MapsApple Maps India redesignApple Maps Telugu supportApple Maps 3D view IndiaApple navigation updates IndiaHyderabad public transit Apple Maps

More Telugu News

మంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి కన్నుమూత

18 Nov, 21:55

వచ్చే 6 నెలల విద్యుత్ డిమాండ్‌కు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి: చంద్రబాబు ఆదేశం

18 Nov, 21:46

అయ్యప్ప భక్తులకు శుభవార్త: చర్లపల్లి, హైదరాబాద్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లు

18 Nov, 21:39

ఒంగోలు కోర్టు తనకు జైలుశిక్ష విధించడంపై బండ్ల గణేశ్ స్పందన

18 Nov, 21:31

హైదరాబాద్ సమీపంలో రాతి చిత్రాలు.. 5000 ఏళ్ల నాటివి!

18 Nov, 21:23

ఈ ఏడాది రెండోసారి పాల ధరలు పెంచిన అమూల్, మదర్ డెయిరీ

18 Nov, 21:02

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి అంటే..!

18 Nov, 20:55

భారత నేవీ రక్షణ వ్యవస్థలు మరింత బలోపేతం.. ఇజ్రాయెల్ తో కీలక ఒప్పందం

18 Nov, 20:41

పవన్ కల్యాణ్ పేరును ఈ వ్యవహారంలోకి ఎందుకు లాగుతారు?: రుక్మిణి కోట

18 Nov, 20:20

రేపటి నుంచి టీమిండియాతో టెస్టు.. న్యూజిలాండ్ ప్లాన్ ఇదే!

18 Nov, 19:58

47 ఏళ్ల క్రితం పోయిన ఉంగరం.. 3,000 మైళ్లు ప్రయాణించి అప్పగించిన వ్యక్తి

18 Nov, 19:49

హైదరాబాద్ రియల్ ఎస్టేట్: అందరి చూపు శంషాబాద్ పైనే!

18 Nov, 19:38

కర్నూలు ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్ డిశ్చార్జ్.. భారీ బందోబస్తు మధ్య జైలుకు

18 Nov, 19:29

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన అర్ష్‌దీప్ సింగ్

18 Nov, 19:25
..More Telugu News