సీఎస్‌కేలో ఓ ఆటగాడు ధోనీని తిట్టాడా? మిస్టర్ కూల్ సమాధానం వింటే సలాం చేస్తారు!
Advertisement
- ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీని దూషించిన ఓ యువ సీఎస్‌కే ఆటగాడు
- యూట్యూబ్ వేదికగా సంచలన విషయం బయటపెట్టిన ఆకాశ్ చోప్రా
- ఆటగాడిని ఇంటికి పంపాలన్న మేనేజ్ మెంట్ మాటలను ధోనీ తోసిపుచ్చాడని వెల్లడి
- జట్టు ప్రయోజనాలే ముఖ్యమని మిస్టర్ కూల్ తన ఇగోను పక్కనపెట్టాడని కితాబు
- ధోనీ సంయమనంతోనే చెన్నై ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిందన్న చోప్రా
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ సారథి ఎంఎస్ ధోనీ నాయకత్వ పటిమ, మైదానంలో అతడు ప్రదర్శించే సంయమనం గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో చెన్నై జట్టుకు చెందిన ఓ యువ ఆటగాడు ధోనీతో అత్యంత అనుచితంగా ప్రవర్తించాడని, చివరికి అతడిని దుర్భాషలాడాడని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన విషయాన్ని వెల్లడించాడు. ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, అతడి అసమాన కెప్టెన్సీ శైలిని విశ్లేషిస్తూ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నాడు.
ఆకాశ్ చోప్రా తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన 2023 సీజన్ సమయంలో జట్టులోని ఓ యువ క్రికెటర్ ధోనీతో అనుచితంగా వ్యవహరించాడు. ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో జట్టు సభ్యులు, మేనేజ్‌మెంట్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. సదరు ఆటగాడి ప్రవర్తనను సహించలేక, అతడిని వెంటనే టోర్నీ నుంచి తప్పించి ఇంటికి పంపించేయాలని ధోనీకి గట్టిగా సూచించారు. జట్టులో ఆ ఆటగాడు లేకపోయినా సీఎస్‌కే అద్భుతంగా రాణిస్తోందని, అతని అవసరం జట్టుకు లేదని తేల్చిచెప్పారు.
అయితే, సంక్షోభ సమయాల్లోనూ ప్రశాంతంగా ఆలోచించే ధోనీ వారి ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించాడు. ఆ సమయంలో ధోనీ స్పందించిన తీరు అతడి పరిణతిని తెలియజేస్తుందని చోప్రా వివరించాడు. "అతను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ నేను ఈ జట్టుకు కెప్టెన్‌ను. నా వ్యక్తిగత అహం (ఇగో) సంతృప్తి పడాలంటే అతని బ్యాగులు సర్ది ఇంటికి పంపించేయొచ్చు. కానీ అతను జట్టుకు ఉపయోగపడతాడు, చెన్నై జట్టు మ్యాచ్‌లు గెలవడానికి సాయపడతాడు. కాబట్టి నా ఆత్మగౌరవాన్ని, ఇగోను పక్కనపెట్టి అతనితోనే మ్యాచ్‌లు ఆడిస్తాను" అని ధోనీ స్పష్టం చేసినట్లు చోప్రా గుర్తుచేసుకున్నాడు.
వ్యక్తిగత పట్టింపుల కంటే జట్టు ప్రయోజనాలే పరమావధి అని నమ్మిన ధోనీ నిర్ణయం జట్టుకు ఎంతటి విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. ఆ సీజన్‌లో అద్భుతంగా పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వార్థాన్ని, వ్యక్తిగత పంతాలను పక్కనపెట్టి జట్టును ముందుంచే నాయకత్వ లక్షణానికి ఈ ఘటనే అసలైన నిదర్శనమని చోప్రా కొనియాడాడు. ధోనీ లాంటి నాయకుడు లేని ఐపీఎల్ తన పూర్వ వైభవాన్ని కోల్పోతుందని అతడు అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ, సీఎస్‌కేను 200లకు పైగా మ్యాచ్ లలో నడిపించి 5 ట్రోఫీలను అందించాడు. 272 మ్యాచ్ లలో 5,314 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచాడు. ఆటగాడిగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ, ఐపీఎల్ 2027 సీజన్ నుంచి అతడు సీఎస్‌కే మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు.