టాస్క్‌ఫోర్స్ సోదాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. డీజీపీ, హోంశాఖకు నోటీసులు
Advertisement
- టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాల తీరుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- సాధారణ దుస్తుల్లో, ఎఫ్‌ఐఆర్ లేకుండా తనిఖీలు చేయడంపై పిటిషనర్ అభ్యంతరం
- బీఎన్ఎస్ఎస్ నిబంధనలను టాస్క్‌ఫోర్స్ ఉల్లంఘిస్తోందని న్యాయవాది వాదన
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి... రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలకు నోటీసులు జారీ చేశారు. ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
బోరబండ ప్రాంతానికి చెందిన బి. బాలరాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పోలీసు యూనిఫాం ధరించకుండా, సాధారణ పౌర దుస్తుల్లో వచ్చి తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సోదాలు చేయడం, వస్తువులను స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకముందే ఏకపక్షంగా దర్యాప్తు చేపట్టడం బీఎన్ఎస్ఎస్ 2023 నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. సంబంధిత వ్యక్తులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని వాదించారు. అలాగే సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉంటుందని... ఏసీపీ స్థాయి అధికారులు సెర్చ్ వారెంట్లు జారీ చేయడం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను డిసెంబరు నెలకు వాయిదా వేశారు. టాస్క్‌ఫోర్స్ పనితీరుపై హైకోర్టు నోటీసులు జారీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.